వైభవంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలు
21-08-2026 06:20 PM
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): శ్రావణ శుక్రవారం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంతోపాటు మండలంలోని గ్రామాలలో వరలక్ష్మీ వ్రతం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా దేవాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఉదయం నుండి మహిళలు సాంప్రదాయ దుస్తులతో ముస్తాబై ఇళ్లను పూలతో అలంకరించి, వరలక్ష్మి వ్రతం పూజలో పాల్గొన్నారు, ప్రత్యేక పూజలు చేశారు, మహిళలు ఒకరికొకరు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.






