20 August, 2026 | 10:56 PM

నాగార్జున స్కూల్ రూపారెడ్డి హత్యకు నిరసన

20-08-2026 10:19 PM

జడ్చర్లలో ఉపాధ్యాయుల క్యాండిల్ ర్యాలీ

జడ్చర్ల: నల్గొండ జిల్లా నాగార్జున ప్రైవేట్ పాఠశాలలో హత్యకు గురైన ప్రైవేట్ ఉపాధ్యాయురాలు రూపారెడ్డికి జడ్చర్ల పట్టణ ప్రైవేట్ ఉపాధ్యాయులు నివాళులర్పించారు. పట్టణ కేంద్రంలో సమావేశమైన ఉపాధ్యాయులు రూపారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, క్యాండిల్స్ వెలిగించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఉపాధ్యాయులు, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.