పోలేపల్లిలో ఉద్రిక్తత.. బీజేపీ జెండా తొలగింపుపై వివాదం
జడ్చర్ల: జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో గురువారం ఉదయం రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం గ్రామంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జెండాను తొలగించడం ఈ వివాదానికి కారణమైంది.నెల రోజుల్లో జెండాను తిరిగి ప్రతిష్ఠిస్తానని మాట ఇచ్చిన సర్పంచ్,నాలుగు నెలలైనా పట్టించుకోకపోవడంపై మండల బీజేపీ కమిటీ తీవ్రంగా మండిపడింది. సర్పంచ్ మాట తప్పారంటూ బీజేపీ శ్రేణులు నిరసనకు దిగడంతో గురువారం గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ వివాదం పై స్థానిక సర్పంచ్ శ్రీశైలం స్పందించారు.
గ్రామ అభివృద్ధి పనులు,రోడ్డు విస్తరణలో భాగంగానే జెండాను తొలగించాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇట్టి విషయం పైన గ్రామంలోని బిజెపి కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని ఆయన పేర్కొన్నారు.అతి త్వరలోనే బీజేపీ జెండా పునర్నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానని సర్పంచ్ శ్రీశైలం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.






