20 August, 2026 | 11:38 PM

విద్యార్థులకు విద్య దూరం చేసే ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలి

20-08-2026 10:36 PM

రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు చేయనని, మరో దారిలో అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు వేముల నాగరాజు లావుడియ రాజు

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం  యాదగిరిగుట్ట పట్టణంలో  రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యాసంస్థల బంద్ కు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా యాదగిరి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్ని విద్యా సంస్థ బంధు నిర్వహించి పట్టణంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఇంటిని ముట్టడిని నిర్వహించారు.

ఎమ్మెల్యే అందుబాటు లేకపోవడం ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ విప్  బిర్ల ఐలయ్య మాట్లాడుతూ సమస్యను త్వరగా పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటి బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అవలంబించడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళ వ్యక్తం చేశారు.

పాలిటెక్నిక్ కళాశాలలను  యంగ్ ఇండియా స్కీల్ యూనివర్శీటీ జాతీయ విద్యావిధానం లో భాగంగా ఏర్పాటు చేశారు. ఆనంద్ మహేంద్ర ను చైర్మన్ గా ఉన్న (పిపిపి)లో  భాగంగా నడుస్తున్న యూనివర్శీటిలో విలీనంచేస్తే ప్రభుత్వ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. సాంకేతిక విద్య ప్రైవేటు పరం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా వీటిని యంగ్ ఇండియా స్కీల్ యూనివర్శీటీ లో వీలీనం చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం లేదని, తక్షణమే ప్రభుత్వం తమకు వీలీనం చేసే ఉద్దేశ్యం లేదని ప్రకటన చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను PPP/ప్రైవేటీకరణకు అప్పగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరింది.