21 August, 2026 | 12:12 AM

అనురాగ్ లో సివిల్ ఇంజినీరింగ్ ఇండక్షన్ లో కెరీర్ అవకాశాలపై అవగాహన

20-08-2026 10:47 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లోని సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన ఇండక్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా కెరీర్ అవకాశాలు, సమాజంలో సివిల్ ఇంజినీర్ల పాత్రపై ప్రత్యేక అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో జెఎల్ఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ. శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు నిర్మాణ రంగం, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో ఉన్న విస్తృతమైన కెరీర్ అవకాశాలను ఆయన వివరించారు. సమాజ అభివృద్ధిలో సివిల్ ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సురక్షితమైన భవనాలు, రహదారులు, వంతెనలు ఇతర మౌలిక వసతుల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో సివిల్ ఇంజినీర్లు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్  పల్లవి బాద్రి, డీన్, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ వి. విజయ్ కుమార్ పాల్గొన్నారు.