21 August, 2026 | 12:06 AM

హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

20-08-2026 10:21 PM

బోథ్,(విజయక్రాంతి): వర్షాకాలంలో హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని ఎస్సి హాస్టల్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారికి ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ ఫిర్యాదుల పెట్టిన ఉంచాలని వార్డెన్ విజయ రెడ్డికి సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని పేర్కొన్నారు. కిచెన్ పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. ప్రతిరోజు విద్యార్థుల పైన దృష్టి సారించి ఉండాలన్నారు. వారి చదువులపై దృష్టి సారించాలని కోరారు.