పోలీసు విధులకు అటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి
బోథ్,(విజయక్రాంతి): పోలీసు విధులకు అటంకపరిచే విధంగా వ్యవహరించిన పోలీసుల గౌరవానికి భంగం కలిగించిన కించపరిచిన వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ కిట్ సామాగ్రిని పరిశీలించడంతోపాటు వీధుల నిర్వహణ సమయంలో చక్కటి యూనిఫామ్ ధరించాలని సూచించారు.
స్టేషన్ పరిసరాలను పరిశీలించి మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. స్టేషన్లో నమోదైన రికార్డులు కేసులో ఫైళ్ళతో పాటు ఇతర రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది. వర్జికల్ విధానాన్ని సమతవంతంగా అమలు చేయాలని సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని ఆదేశించారు.
గ్రామ పోలీసింగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలని వాటి పట్ల పర్యవేక్షణ ఉండాలన్నారు. నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని రౌడీ శీటర్లు సస్పెక్టెడ్ కేసులు ఉన్న వారిపై నిఘా ఉంచాలన్నారు. శాంతిభద్రతలకు విభూతం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు సమాచారాన్ని సేకరించి సమస్య పెద్దది కాకముందే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, బూతు సిఐ ,డి ,గురుస్వామి ఎస్సై వి పురుషోత్తం లు ఉన్నారు






