20 August, 2026 | 11:30 PM

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు

20-08-2026 10:49 PM

సామూహిక వరలక్ష్మి వ్రతాలకు  ఏర్పాట్లు

యాదగిరిగుట్ట దేవస్థానం హుండీ ఆదాయం 3,52,47,662/-

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో గురువారం నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వయంభులను మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్టమూర్తులను వేదమంతోత్సవములు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలలను అర్పించారు.

ప్రాకారమంటపంలో సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం పండితులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారి వెండి జోడు సేవలో స్వామివారిని అలంకరించి తిరువీధుల గుండా స్వామి వారిని ఊరేగించారు. శ్రావణమాసంలో శుక్రవారం నిర్వహించే శ్రావణ శుక్రవారం ను యాదగిరిగుట్ట లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు, అందులో భాగంగా కొండ కింద వ్రత మండపం హాల్ నెంబర్ 2 లో సామూహిక వరలక్ష్మి వ్రతాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారి తెలిపారు.

19వ తేదీనే ఈ వరలక్ష్మీ వ్రతాలకు బుకింగ్ పూర్తయినట్లు ఆలయాలు తెలిపారు. స్వామివారి హుండీ 3,52,47,662/-. యాదగిరిగుట్ట దేవస్థానం హుండీ లెక్కింపును కొండ కింద వ్రతమంటపం హాల్ నెంబర్ 2 లో లెక్కించారు. 49 రోజుల హుండీ లెక్కింపు లో  3,52,47,662/-  వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేశీయ కరెన్సీ తో పాటు 15 దేశాల విదేశీ కరెన్సీ  వచ్చాయని, బంగారం, వెండి, నాణెములను మొత్తం  లెక్కించడం జరిగిందని దేవస్థానం ఈవో భవాని శంకర్ తెలిపారు. హుండి లెక్కింపును పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.