గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
పద్మాజీవాడి సర్పంచ్, ఉపసర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక
సదాశివనగర్,(విజయక్రాంతి): పద్మాజివాడి గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని మహిళా సమైక్య భవనానికి భూమి పూజ చేశారు. పద్మాజివాడి చౌరస్తాలో వారంతాపు సంతలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్మాజివాడి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం పద్మాజివాడి నుంచి ఎక్స్ రోడ్ వరకు తాగునీటి పైపులను కోసం పది లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ లోకోటి సుబ్బారావు ఉపసర్పంచ్ అలవెల్లి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో టిడిపి చైర్మన్ ఈర్షద్, మార్కెట్ కమిటీ చేర్మెన్ సంగ్యా నాయక్, నాయకులు మహిపాల్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,గంగాధర్,రూపేందర్ రెడ్డి, బాలయ్య, సంగయ్య,కవిన్, జాకిర్ తదితరులు పాల్గొన్నారు.






