calender_icon.png 17 February, 2026 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన లో మహిళలకు సముచిత స్థానం

17-02-2026 01:27:11 PM

 పాత మూల్గరులో మహిళా సమైక్య భవనానికి భూమి పూజ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

భూత్పూర్ : మహిళలకు సముచిత స్థానం ప్రజాపాలన ప్రభుత్వం కల్పిస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలం పరిధిలోని పాత మొల్గర గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిర్వహించిన  దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజను చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం అవసరమైన సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తూ మహిళల పేరిటనే ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరుగుతుందని, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రజలందరూ సంపూర్ణ మద్దతు తెలియజేయలని సూచించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.