calender_icon.png 17 February, 2026 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లాపూర్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 01:23:01 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రం లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు(KCR birthday celebrations ) మంగళవారం ఘనంగా నిర్వహించారు. భారత మాత కూడలి వద్ద మండల అధ్యక్షుడు తోట శ్రీను ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర అపూర్వమని అయన నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.