9 June, 2026 | 3:52 AM

ఎమ్మెల్యే యాదయ్యకు కృతజ్ఞతలు తెలిపిన ప్రొద్దటూరు వాసులు

09-06-2026 12:21 AM

శంకర్ పల్లి జూన్ 8 (విజయక్రాంతి): శంకర్ పల్లి మండలంలోని ప్రొద్దటూరు- మేడిపల్లి గ్రామం వరకు రెండున్నర కిలోమీటర్ల రోడ్డు, ప్రొద్దటూరు- టంగటూరు గ్రామం వరకు మూడున్నర కిలోమీటర్ల రోడ్లకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చొరవతో రూపాయాలు 5.50 కోట్ల నిధులు మంజూరు చేయించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

సోమవారం ఎమ్మెల్యే యాదయ్య స్వగృహం నందు కలిసి ఆయనకు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్ల పనులను త్వరగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండ లక్ష్మి నరసింహ, మాజీ ఎంపిటిసి బొల్లారం వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సొసైటీ చైర్మన్ బొల్లారం మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.