17 April, 2026 | 8:19 PM

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

17-04-2026 07:07 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సదాశివనగర్ ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఉద్యోగస్తుల నిరసన ప్రదర్శన చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేశారు. నేడు తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగ, గెజిటెడ్, పెన్షనర్ల, కార్మికుల ,నాన్ గెజిటెడ్ అధికారులతో ఏర్పడిన రాష్ట్రవ్యాప్త టీజీఈ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు అన్ని మండల కార్యాలయాల ఎదుట తాసిల్దార్ సత్యనారాయణకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.

ఉద్యోగస్తులకు వేతన సవరణ పిఆర్సి 2023 వరకే గడువు ముగించినప్పటికీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ పీఆర్సీని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ, ఉద్యోగస్తులకు ఆరోగ్య కార్డులు మే రెండు నుండి అమలు చేయాలని పిఆర్సిని 51 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ తో జూన్ 2 నుండి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన కొనసాగింది. దాంతోపాటు 64 డిమాండ్లతో భాగంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయ నియామకాల్లో పొందిన వారందరికీ నోటిఫికేషన్ ఇచ్చే నాటికే పాత పెన్షన్ లో ఉండేవారని, 2003లో నియామకం పొందిన ఫలితంగా 2003 ఉపాధ్యాయులకు కొత్త పెన్షన్ లోకి రావడం జరిగింది.

ఇది ప్రభుత్వం చేసిన తప్పిదమే అని జేఏసీ భావిస్తున్నది.. అలాగే ఎంప్లాయిస్ అందరికీ ఆరోగ్య కార్డ్ లు మే నెల 2026 నుండి ఇవ్వాలని, 2024-2025 నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ బకాయిలు చెల్లించాలని ,ఐదు డిఏలు, బకాయిలు పడ్డ ప్రభుత్వం వాటి అమలుకు  త్వరగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని ,మొదటి దశ కార్యక్రమంలో భాగంగా మండలాల ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన జరిగింది. ఈ నిరసన ప్రదర్శన తో ప్రభుత్వం మే ఒకటి లోపట స్పందించకపోతే మే 5 నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

ఈ నిరసన ప్రదర్శనలో  ఉద్యోగులు, జేఏసీ భాగస్వామ్య ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. ఉపాధ్యాయుల తరఫున పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బసంత్ రాజ్ ,రాజిరెడ్డి, డిటిఎఫ్ మండల శాఖ  తరఫున అన్వర్, రాజయ్య, టీపీటీఎఫ్, తపస్ సంఘాల బాధ్యులు తోబాటు, డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ విజయరామరాజు, సీనియర్ ఉపాధ్యాయులు నరేందర్, సత్యనారాయణ, పుష్పలత, శ్రీనివాస్ ,పూర్ణరావు, ఇంద్రశేఖర్, స్వహేంద్రనాథ్, బాపురెడ్డి, లతో పాటు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.