రాజీనామా చేస్తే దిమ్మతిరుగుతుంది..! మంత్రి అడ్లూరిపై కొప్పుల ఈశ్వర్ ఫైర్
18-06-2026 01:14 PM
కరీంనగర్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేత లక్ష్మణ్(Minister Adluri Laxman) కు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమశాఖ టెండర్స్ పై హరీశ్ రావు ప్రశ్నిస్తే ఉలిక్కిపడుతున్నావ్ అన్నారు. రూ. 2 వేల కోట్ల స్కామ్ జరిగిందా లేదా నిరూపించుకోవాలని సూచించారు. స్థానికేతరులకు టెండర్లతో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. అందుకు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ప్రతిసారి రాజీనామా చేస్తానంటున్న లక్ష్మణ్.. ఒక్కసారి రాజీనామా చేస్తే దిమ్మతిరుగుతుందని చమత్కరించారు.






