20 June, 2026 | 1:47 PM

అవినీతిని హరీశ్ రావు నిరూపిస్తే... పదవికి రాజీనామా చేస్తా: మంత్రి అడ్లూరి

18-06-2026 12:31 PM

కరీంనగర్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తె మాజీ మంత్రి హరీశ్(Harish Rao) రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విద్య కిట్లపై మాజీ మంత్రి హరీశ్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Laxman) కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. టెండర్లలో అవినీతి జరిగిందని హరీశ్ రావు ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. అవినీతిని హరీశ్ రావు నిరూపిస్తే... పదవికి రాజీనామా చేస్తానని మంత్రి లక్ష్మణ్ సవాల్ విసిరారు. దొర మెప్పు పొందేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తహతహలాడుతున్నారని విమర్శించారు. హాస్టళ్లకు వంట సామాగ్రి విషయంలో టెండర్లు ఇంకా ఖరారు కాలేదని వివరించారు.