18 June, 2026 | 2:36 PM

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

18-06-2026 01:18 PM

ఆలేరు, జూన్ 18 (విజయక్రాంతి): రాజపేట మండలంలోని పలు బాధిత కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బుధవారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే, రాజపేట మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన పొన్నోజు గణేష్ ఇటీవల మృతిచెందగా, అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం చల్లురు గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన దిడిగా కరుణాకర్ కుటుంబాన్ని, పారుపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన రావుల సొక్కమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.