పీఆర్టీయూతోనే సమస్యలు పరిష్కారం
07-07-2026 08:04 PM
పీఆర్టీయూ(టీఎస్)జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్ రెడ్డి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): పీఆర్టీయూ సంఘంతోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రం అర్వపల్లిలోని జడ్పీహెచ్ఎస్ లో పీఆర్టీయూ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వి.సైదులు, జే.పురుషోత్తం ఆధ్వర్యంలో 2026-27 సంవత్సర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్టీయూ సంఘంతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని, ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్,హెల్త్ కార్డులు, త్వరలో పీఆర్సీపై కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.






