23 March, 2026 | 5:45 AM

బడ్జెట్‌లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదు

23-03-2026 12:35 AM

టీఆర్పీ ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్‌ముదిరాజ్

వరంగల్, మార్చి 22(విజయక్రాంతి): బడ్జెట్‌లో బీసీ వర్గాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, ఇది స్పష్టమైన సామాజిక అన్యాయమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి పల్లెబోయిన అశోక్ ము దిరాజ్ పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ప్రతి ఏడాది రూ.20,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు కేవలం రూ.12,000 కోట్లకే పరిమితం కావ డం బీసీలను మోసం చేయడమేనని అన్నా రు. అదేవిధంగా, బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని ప్రకటించి ఇప్పటికీ అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సుమారు 60శాతం జనాభా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేవలం 6శాతం మాత్ర మే కేటాయించడం తీవ్ర అన్యాయమని, తక్కువ శాతం ఉన్న వర్గాల చేతి లో అధిక బడ్జెట్ కేంద్రీకృతమవడం సామాజిక సమతుల్యతకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యా ప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

జిల్లా, మండల కేంద్రాల్లో ఉ దయం 10 గంటలకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టాలని ప్రకటించారు.ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు భారీ సం ఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక ఇవ్వాలని పిలుపునిచ్చారు. బడ్జెట్‌లో బీసీలకు న్యాయం జరగకపోతే, ప్రజల ఆవేదన మరింత తీవ్రమవుతుంది. ప్రభుత్వం వెంటనే తన విధానాన్ని మార్చుకుని బీసీల వాటాను కేటాయించాలని అశోక్ ముదిరాజ్  స్పష్టం చేశారు.