6 April, 2026 | 8:45 PM

ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతికతకు ప్రాధాన్యం

06-04-2026 07:01 PM

- పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ రఘునందన్

మునుగోడు(నాంపల్లి),(విజయక్రాంతి): ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్)లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నామని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ తెలిపారు. సోమవారం నాంపల్లి గిడ్డంగి నుండి ఘట్టుప్పల చౌక దుకాణాలకు రవాణా అవుతున్న రేషన్ బియ్యం లారీని మార్గమధ్యంలో ఆపి తనిఖీ చేసి మాట్లాడారు.

లారీకి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జిపిఎస్) అనుసంధానం ఉందా లేదా పరిశీలించారు. ట్రక్ షీట్‌లో ఉన్న స్టాక్ వివరాలను సరిపోల్చి తనిఖీలు నిర్వహించారు. జీపీఎస్ లేకుండా రవాణా చేస్తే లారీని సీజ్ చేసి, సంబంధిత గుత్తేదారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రఘునందన్ హెచ్చరించారు.