17 June, 2026 | 4:35 AM

ప్రజాపాలనలో మహిళలకు ప్రాధాన్యం

17-06-2026 02:07 AM

కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తిరుపతి రెడ్డి 

కొడంగల్, జూన్ 16 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వ పాలనలో మహిళలకు  అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తిరుపతి రెడ్డి అన్నారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలోని గుండ్లకుంట గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ ఆధ్వర్యంలో పాల్గొన్న కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ తిరుపతి రెడ్డి  ప్రభుత్వ పాఠశాల అదనపు గదులు, కాపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం మహిళా అభివృద్ధి కొరకు కుట్టు మిషన్ ల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు కా ర్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అనేక సంక్షే మ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.

మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ కావడంతో అభివృద్ధి దిశలో ముందు వరుసలో కొనసాగుతుందని అన్నారు. వేలకోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఏఎంసీ చైర్మన్ అంబయ్య గౌడ్, కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.