24 August, 2026 | 3:33 AM

కొత్త రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్రమోదీ ఫొటో పెట్టాలి

24-08-2026 12:40 AM

ఖమ్మం, ఆగస్టు 23(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్  నున్నా రవికుమార్ కూసుమంచి మండలం కేశపురం గ్రామంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో పాలేరు నియోజకవర్గం ఇంచార్జ్ నున్నా రవికుమార్ మాట్లాడుతూదేశవ్యాప్తంగా ఆహార భద్రత కోసం ప్రధానమంత్రి గరీబ్ యోజన పథకం ద్వారా 2019 నుండి 2031 వరకు ఉచితంగా 5 కేజీలు ఇస్తున్నారు ఇంకా ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు .

సొమ్ము కేంద్రానికి ఫోటోలు మివా 1 కేజీ బియ్యం ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెట్టడం సరికాదని తెలిపారు.   గత ప్రభుత్వం ధరణి పేరుతో దోపిడి చేస్తే ఈ ప్రభుత్వం భూభారతి పేరుతో సామాన్య మధ్యతరగతి వారిని ఇబ్బందులు గురిచేస్తూ  22a  జీవో ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూదందాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బెల్లం మురళి, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మీగడ గోపి, జిల్లా నాయకులు వార్డ్ మెంబర్  గుండా ఉపేందర్ రెడ్డి, కోటి హనుమంతరావు, బద్దం వెంకటరెడ్డి, మంద చంద్రశేఖర్ గౌడ్ లు పాల్గొన్నారు.