ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు
08-05-2026 01:03 AM
- మధ్యాహ్నం శంకుస్థాపనలు
- సాయంత్రం బహిరంగ సభ
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాద్‌కు రానున్నారు. అం దుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైం ది. 10న బెంగుళూరు నుంచి బేగం పేట విమానాశ్రయానికి మధ్యాహ్నం 2.50 గంటలకు చేరుకోనున్నారు. అనంతరం హెచ్‌ఐసీసీకి వెళ్లి అక్కడే ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
అనంతరం హైటెక్ సిటీలోని ఓ ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించ నున్నారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజ రై ప్రసంగించనున్నారు. ఆ తర్వాత బేగంపేట ఏయిర్‌పోర్టు నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు పయనమవుతారు.






