6 July, 2026 | 1:53 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

లారీల కొరతను నివారించేందుకు చర్యలు చేపట్టిన ఎస్‌ఐ, ఏఎంసీ చైర్మన్

08-05-2026 01:08 AM

రుద్రంగి మే7 (విజయక్రాంతి): రుద్రంగి మండల కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్లను త్వరితగతిన రైస్ మిల్లులకు పంపే ఏర్పాట్లలో భాగంగా గురువారం స్థానిక ఏఎంసీ చైర్మన్ చేలుకల తిరుపతి, ఎస్త్స్ర మోతిరామ్ ల ఆధ్వర్యంలో లారీలను సేకరించే పనిలో పడ్డారు.

ఈ సందర్భంగా వారు రుద్రంగి మండల కేంద్రంలో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించేందుకు లారీలు కొరత ఉండడంతో బుధవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మిల్లర్లు మరియు లారీల కాంట్రాక్టు దారు కలిసి యుద్ధ ప్రాతిపాదికన కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డుల నుండి తరలించే పనిలో ఉన్నారు.

అందులో భాగంగానే తమ వంతుగా రుద్రంగి మండల కేంద్రంలో ఖాళీగా ఉన్న, అటువైపుగా ఖాళీగా వస్తున్న లారీలను గుర్తించి వాటి ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గట్ల మీనయ్య, గడ్డం స్వామి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.