27 July, 2026 | 3:36 AM

రక్షణ రంగంలో రికార్డులు

27-07-2026 12:00 AM

స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి నౌక 

ఈ యుద్ధ నౌక నావికాదళంలో చేర్చాం

శౌర్య విజయ్ యాత్ర కొనసాగుతోంది

136వ మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూలై 26: రక్షణ రంగంలో దేశం సరికొత్త రికార్డులు సాధిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి నౌక ఇందుకు ప్రతీకగా నిలుస్తోందని, ఈ యుద్ధ నౌక నావికాదళంలో చేర్చామని చెప్పారు. ఆదివారం న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన 136వ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి నౌక రక్షణ రంగ తయారీ సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. ఇందులో 75 శాతాని కి పైగా స్వదేశీ పరికరాలనే వినియోగించామని వెల్లడించారు.

దూర లక్ష్యాలను ఛేదించే గైడెడ్ రాకెట్ పరీక్షలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. కుషా క్షిపణి ప్రయోగాల విజయవంతంపై డీఆర్డీఓను అభినందించా రు. ఇండోనేషియాతో బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని కొనియాడారు. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన దేశపు తొలి రాకెట్ విక్ర మ్ ప్రయోగం విజయవంతమైందంటూ గుర్తు చే శారు. విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ సైనికుల త్యాగాలను గుర్తుచేశారు.

ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం నుంచి కార్గిల్‌లోని ద్రాస్ యుద్ధ స్మారకం వరకు శౌర్య విజయ్ యాత్ర కొనసాగుతోందని అన్నారు. కాశ్మీరీ సాం ప్రదాయ చాపల తయారీ కళ వాగు పునరుద్ధరణ జరుగుతోంది. దీనికోసం గులాబ్ హుస్సేన్, తన్జిలా కృషితో పాటు ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లా మహిళల కృషిని ప్రధా ని వివరించారు.

ఆ మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హె ర్బల్ టీ తయారు చేస్తున్నారు అని వివరించారు. అంతర్జాతీయ వేదికలపై మన అథ్లెట్లు ప్రతిభ కనబరుస్తున్నా రని, జపాన్ ఓపెన్ బాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారని, లండన్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచిందంటూ గుర్తు చేశారు. కేరళలోని ఎర్నాకులం విద్యార్థుల సంస్కృత క్లబ్ పనితీరును మెచ్చుకుని, సైన్స్ ఒలింపియాడ్‌లో పతకాలు సాధించారని తెలిపారు.