సౌదీ రిఫైనరీపై హౌతీల దాడి
‘అరామ్‌కో రాస్ తనురా’ లక్ష్యంగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం
రిఫైనరీలో భారీగా మంటలు
చమురు ఉత్పత్తి నిలిపివేత
అబుదాబి, జూలై 26 (విజయక్రాంతి): పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. అమెరికా, -ఇరాన్ దేశా ల మధ్య ఇప్పటికే వరుస దాడులు కొనసాగుతుండగా, మరోవైపు యెమెన్‌లోని ఇరా న్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారుల దాడులు ప్రపంచ దేశాలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
సౌదీ అరేబియా లోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్‌కో రాస్ తనురా రిఫైనరీపై హు తీలు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడికి పా ల్పడ్డారు. యెమెన్‌పై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరుపుతున్న వైమానిక దా డులకు వ్యతిరేకంగా తాము ఈ ప్రతిదాడులు చేసినట్లు హౌతీ మిలిటరీ అధికారికం గా ప్రకటించింది. దాడి కారణంగా రిఫైనరీ వద్ద భారీగా మంటలు చెలరేగాయని, మం టలను వెంటనే అదుపులోకి తెచ్చామని, ప్రా ణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఎర్ర సముద్రంలో దిగ్బంధనానికి హూతీల హెచ్చరిక
యెమెన్‌పై సైనిక చర్యలు కొనసాగినంతకాలం ఎర్ర సముద్రంలో సౌదీకి చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హూ తీలు హెచ్చరించారు. బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ప్రకటించడం అంతర్జాతీయ షిప్పింగ్ రంగాన్ని కలవరపెడుతోంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు, సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
క్షీణిస్తున్న అమెరికా క్షిపణుల నిల్వలు
ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. తమ వద్దనున్న ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయనే నేపథ్యంలోనే ఇరాన్‌పై సైనిక చర్యలు తీవ్రం చేసే ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. స్థావరాల రక్షణ కోసం దాడులు ఉధృతం చేస్తే నిల్వలు వేగంగా కరిగిపోవచ్చని సైనికాధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కాగా, యుద్ధంలో ఇరాన్ చౌకగా తయారు చేసిన డ్రోన్లను భారీ సంఖ్యలో వినియోగిస్తోంది. ఒక్కో డ్రోన్ ధర కేవలం 20వేల నుంచి 50వేల డాలర్ల లోపే.






