10 July, 2026 | 10:24 PM

గిరి ప్రదర్శనకు ఉమామహేశ్వరం అర్చకులు సభ్యులు

10-07-2026 09:09 PM

అచ్చంపేట: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అర్చకుల తో పాటు పాలకమండలి సభ్యులు శ్రీశైలం గిరి ప్రదర్శనకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం ఆలయం నుంచి ప్రత్యేక వాహనంలో చైర్మన్ మాధవరెడ్డి ఈవో శ్రీనివాసరావుతో పాటు పాలకవర్గం సభ్యులు ఇతర సిబ్బంది గిరి ప్రదర్శనకు వెళ్లారు. ఈనెల 13 వరకు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు  సందర్శించి మహాన్యాసం చేయనున్నారు. అనంతరం ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.