10 July, 2026 | 10:04 PM

రోగులు, వృద్ధులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ

10-07-2026 09:00 PM

అచ్చంపేట: ప్రముఖ సామాజిక వేత్త, అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అండపల్లి జలంధర్ రెడ్డి జన్మదిన వేడుకలను అమ్రాబాద్ మండలం మాచారంలో  గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జలంధర్ రెడ్డిని భారీ గజమాలతో సత్కరించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు పలు సేవా కార్యక్రమాలు  నిర్వహించారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బోల్గేట్‌పల్లి  సమీపంలోని లేనిటీ ఫౌండేషన్‌ వృద్ధాశ్రమంలో వృద్ధులకు  పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను అందజేశారు. సమాజ సేవే నిజమైన పుట్టినరోజు వేడుకల ఉద్దేశమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో కోరే రేణయ్య, రాంచందర్, దొడ్ల అంజి యాదవ్, జగన్, ఖాసీం, రామాంజనేయులు, వెంకటేష్, పర్వతాలు, శ్రీను తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.