calender_icon.png 15 February, 2026 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్మీడియట్ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలి

15-02-2026 12:41:23 AM

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి  

తెలంగాణ ఆర్టీఐ, మానవ హక్కుల సంఘం విజ్ఞప్తి 

హైదరాబాద్, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, మానసిక భారాన్ని తగ్గించడానికి తెలంగాణ ఆర్టీఐ,మానవ హ క్కుల కార్యకర్తల సంఘం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. విద్యార్థుల శ్రేయస్సు, భద్రతను కాపాడటమే కాకుండా, సురక్షితమైన విద్యా వాతావరణం ఏర్పరచడమే తమ లక్ష్యమని సంఘం ప్రతినిధులు తెలిపారు.

సంఘం విడుదల చేసిన విజ్ఞప్తి పత్రంలో విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ఒత్తిడి లేని నిర్వహణ మండళ్లు ఏర్పాటు చే యడం తప్పనిసరి చేయాలని సూచించారు. వీటి ద్వారా విద్యార్థుల కోసం సలహా కార్యక్రమాలు మరియు తల్లిదండ్రుల మార్గదర్శక సమావేశాలు నిర్వహించాలన్నారు.ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఉచిత బస్సు సేవ లు అందించాలనీ, విద్యార్థి గుర్తింపు కార్డు ఆధారంగా రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ట్రాఫిక్ సమస్యల నివారణలో భాగంగా కళాశాల ఆవరణలో ప్రైవేట్ వాహనాల ప్రవేశంపై నిషేధం, పార్కింగ్ ని షేధం, హార్న్ నిషేధ ప్రాంతాల గుర్తింపు, అ లాగే వాహన రహిత ప్రాంతాల ఏర్పాటు తప్పనిసరి చేయాలని విజ్ఞప్తి చేశారు.  అజయ్ కుమార్ - చైర్మన్, దారా మౌనిక -అధ్యక్షురాలు, వెంకట్ నరసింహ రెడ్డి - జనరల్ సెక్రటరీ, సాయి ప్రసాద్ రావు -అవేర్నెస్ ప్రోగ్రాం ఇన్చార్జి, శ్రీనివాస్ - లీగల్ అడ్వైజర్, సాయి వెంకట్ రావు - కో- ఆర్డినేట ర్ , ప్రేమ్ కుమార్ - మెంబర్ తదితరులు పాల్గొన్నారు.