15-02-2026 12:46:04 AM
రంగంలోకి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి
జతకట్టనున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్‌బీ
ఉత్కంఠగా మారిన కరీంనగర్ మేయర్ ఎన్నిక
కరీంనగర్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): కరీంనగర్ మేయర్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది. 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ నగరపాలక సంస్థలో మేయర్ పీఠం దక్కాలంటే 34 స్థానాలు ఉండాలి. బీజేపికి 30 ఉండడంతో ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకుని 31 అవుతుండగా మరో నలుగురి కోసం క్యాంపు నిర్వహిస్తోంది.
కేంద్రమంత్రి బండి సంజయ్ స్పీడ్‌కు బ్రేక్‌వేసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం, ఏఐఎఫ్‌బీ పార్టీలు ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇండిపెండెంట్లను తమవైపు తిప్పుకునేందుకు స్కెచ్ వేస్తున్నాయి. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అభ్యర్థులకే ఫోన్లుచేస్తున్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు14, బీఆర్‌ఎస్‌కు 9, ఎంఐఎంకు3, ఫార్వర్డ్‌బ్లాక్‌కు2 స్థానాలు ఉన్నాయి. గెలిచిన 8 మంది స్వతంత్రులు మద్దతు ఇస్తేనే వీరి వ్యూహం ఫలించనుంది.