సింగరేణిపై గ్యాస్ కుంపటి!
- బొగ్గు నుంచి గ్యాస్ ఉత్పత్తికి సన్నాహాలు
- ఇప్పటికే కేంద్రం అనుమతి
- గనుల కోసం అన్వేషణ
- పైలెట్ ప్రాజెక్టుగా బెల్లంపల్లి
- కార్మికుల్లో కలవరం.. భవిష్యత్తుపై ఆందోళన
- సంస్థ లాభాల కోసమేనంటున్న యాజమాన్యం
బెల్లంపల్లి, ఆగస్టు 13 (విజయక్రాంతి): నల్ల బంగారాన్ని నమ్ముకుని బతుకుతున్న వేలాది కుటుంబాల భవిష్యత్తుపై ఆందోళన మేఘాలు కమ్ముకుంటున్నాయి. సింగరేణి కంపెనీలో గ్యాసిఫికేషన్ ప్రక్రియకు కేంద్రం అనుమతులు ఇవ్వగా, పైలెట్ ప్రాజెక్టుగా బెల్లంపల్లి ప్రాంతాన్ని ఎంపిక చేయడం.. ఇక్కడి ప్రజల్లో భయాందోళనకు ప్రధాన కారణంగా మారింది. ఇప్పటికే గనులు, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు ఈ ప్రాజెక్టుపై ఆలోచనలో పడ్డాయి.
అయితే సింగరేణి యాజమా న్యం మాత్రం గ్యాసిఫికేషన్‌ను సంస్థ అభివృద్ధికి నూతన అధ్యాయంగా అభివర్ణిస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను అన్వేషించడం లో భాగంగానే ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని చెబుతోంది. కొన్ని కార్మిక సంఘాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండ గా, మెజార్టీ యూనియన్లు మాత్రం ఏకీభవిస్తలేవు. మరోవైపు నష్టాలు, లాభాలపై పూర్తి స్పష్టత లేకుండానే ప్రాజెక్టును స్వాగతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సింగరేణి సంస్థ కేవలం ఒక కంపెనీ కాదని, లక్షలాది మంది జీవనాధారమని, అలాంటి సంస్థ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కార్మికులు, ప్రజల అభిప్రా యాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసమో సంస్థను బలిపీఠం ఎక్కిం చవద్దని కోరుతున్నారు. అయితే గ్యాసిఫికేషన్‌తో సింగరేణికి కొత్త ఊపిరి వస్తుందా? లేక కార్మికుల భవిష్యత్తుపై కొత్త సవాళ్లు ఎదురవుతాయా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం కోల్ బెల్ట్‌లో చర్చనీయాంశంగా మారాయి.
కొత్త ప్రాజెక్టుల దిశగా అడుగులు
బొగ్గు వనరుల సాధన కోసం కొత్త ప్రాం తాలకు విస్తరిస్తూనే, మరో వైపు కొత్త ప్రాజెక్టుల దిశగా సింగరేణి సంస్థ అడుగులు వేస్తో ంది. అందుకోసం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో గ్యాసిపికేషన్ కోసం అనుమతులు పొందిన విషయమే విధితమే. పైలట్ ప్రాజెక్టుగా బెల్లంపల్లిని ఎంపిక చేశారు. ఈ మేరకు భూద గెస్ట్ హౌస్ సమీపంలో డ్రిల్లింగ్ హో ల్ కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. కొత్తగా సింగరేణిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు లాభ నష్టాలు ఎలా ఉంటాయో అన్నది చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి కేంద్రం గా పైలెట్ ప్రాజెక్టు వల్ల స్థానికుల్లో ఒకరకమైన ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
గ్యాస్ గనులుగా రూపాంతరం
గ్యాసిపికేషన్ అంటే బొగ్గు నుంచి గ్యాస్ ను ఉత్పత్తి చేస్తారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైతే సింగరేణి భూగర్భ గనుల్లో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే నూతన శకం మొదలు కానుంది. దీంతో సింగరేణి బొగ్గు గనులు, గ్యాస్ గనులుగా రూపాంతరం కానున్నాయి. గ్యాసిపికేషన్ ప్రాజెక్టు వల్ల నల్లనేలకు తీరని నష్టం వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ గనుల నిర్వహణతోనే సింగరేణి పరీవాహక ప్రాంత వాసులు అనేక విధాలుగా నష్టపోయారు.
భూగర్భంలో నీటిమట్టం తగ్గిపోయి, వ్యవసాయం కుదేలు అయినప్పటికీ ఉపాధి అవ కాశాల కోసం భరిస్తూ వస్తున్నారు. స్థానిక అభివృద్ధి ఆకాంక్షతో సింగరేణి ప్రాంతీయు లు భూగర్భ గనులను సమ్మతించారు. కాలక్రమేణా వాటి స్థానంలో ఓపెన్ కాస్ట్‌లు తె చ్చారు. ఇదే క్రమంలో భూగర్భ గనులకు స్వ స్తి పలికారు. ఈ రకంగా జరిగిన నష్టం చాలదన్నట్టు, తాజాగా గ్యాస్ గనులకు సింగరేణి శ్రీకారం చుట్టబోతోంది. గ్యాస్ గనులు మొ దలైతే ఓపెన్‌కాస్ట్‌ల వల్ల లభించిన నామమాత్రపు ఉపాధి ఆవకాశాలు కూడా చేజా రిపో తాయనే ఆందోళన స్థానికుల్లో మొదలైంది.
అధిక లాభాల ఆశతో ఓపెన్ కాస్ట్‌లు తవ్వి గ్రామాలు, పట్టణాలను బొందలగడ్డలుగా మార్చారని.. అయినా ప్రయోజనాలు తీర డం లేదని, తాజాగా గ్యాస్ ఉత్పత్తిపై సింగరేణి దృష్టి సారించింది. సంస్థ మనుగడకు భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్‌లు సరిపోలేదని, గ్యాస్ ఉత్పత్తి ద్వారా లాభాలు ఎలా సాధ్యమన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
పైలెట్ ప్రాజెక్టు పూర్తవగానే పబ్లిక్ ఇయరింగ్
గ్యాసిఫికేషన్ పైలెట్ ప్రాజెక్టు పూర్తవగానే పబ్లిక్ ఇయరింగ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియపై ప్రజలు, కా ర్మికులు, కార్మిక సంఘాలు ఎలా స్పం దిస్తారన్నది ఆసక్తిగా మారింది. బొగ్గు గనుల నుంచి గ్యాస్ ఉత్పత్తిని సమ్మతిస్తారా? అన్నది ప్రధాన చర్చనీయాంశ ంగా మారింది. 20 ఏళ్ల క్రితమే బెల్లంపల్లి కేంద్రంగా మిథున్ గ్యాస్ ఉత్పత్తి కోసం సింగరేణి సంస్థ బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్‌లో పబ్లిక్ ఇయరింగ్ నిర్వహించింది. యావత్తు పట్టణ ప్రజలు, కార్మిక సంఘాలు ససేమిరా ఒప్పుకోలేదు. ఆదిలోనే మిథున్ గ్యాస్ ఉత్పత్తి ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా మ రోమారు గ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను సిం గరేణి తెరపైకి తెచ్చింది. స్థానిక ప్రజలు ఇప్పుడేలా స్పందిస్తారన్నది ఉత్కంఠగా మారింది.






