వారసత్వ సంపదను కాపాడండి
కొత్త తెలంగాణ చరిత్ర బృందం వినతి
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ఈ విధ్వంసాన్ని నిలిపేసి, వారసత్వ సంపదను కాపాడండని ప్రభుత్వానికి కొత్త తెలంగాణ చరిత్రబృందం వినతి. 800సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించిన ఈ శివాలయాన్ని కూల్చడానికి దినం పట్టకపోవచ్చు. కాని, కట్టడానికి యేండ్లు పడుతయి. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆవరణలో గుడి వుంటే దేనికి అడ్డంకి. అదొక వారసత్వనిర్మాణాన్ని ఉండనీయొచ్చుకదా. ఎవరిదీ పాపం? ఎందుకా గుడికి శాపం? వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్‌నగర్ సమీపంలో కాకతీయుల నాటి ఆలయాన్ని కూల్చివేయబడ్డది.
ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇంటిగ్రెటేడ్ స్కూల్ ఆవరణలో ఉన్న రాష్ట్ర పురావ స్తుశాఖ పరిధిలోని శివాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చివేశారు. ఎవరి అండతో కాంట్రా క్టర్ ఇష్టానుసారంగా ఈ గుడిని నేలమట్టం చేశారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు, దేవాదాయ శాఖల కనీస అనుమతి వుందో లేదో చెప్పేవారు లేరని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇప్పటికైనా వారసత్వ సంపదను కాపాడాల్సిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.






