వదలపర్తిలో పచ్చదనం పరిరక్షణ
20-07-2026 08:18 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వదలపర్తి గ్రామంలో పచ్చదనం పరిరక్షణలో భాగంగా గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ, ఎంపీడీవో గంగాధర్ వివిధ రకాల మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవడం మన అందరి బాధ్యత అని సర్పంచ్ సత్య బోయిన పద్మా నారాయణ తెలిపారు. అలాగే గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో సీజనల్ వ్యాధుల గురించి తెలియజేసి హెల్త్ సెంటర్కు వచ్చినవారికి జ్వరం,బీపీ, షుగర్ వ్యాధులు చెక్ చేసి మందులు ఇవ్వడం జరిగింది.అంగడివాని కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు వండిపెట్టిన వంటలను పరిశీలించి ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి స్కూల్ డ్రెస్సులను పిల్లలకు అందజేశారు.






