30 May, 2026 | 2:33 AM

సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో..

30-05-2026 01:17 AM

‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో దర్శకుడిగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను నమోదు చేశారు సందీప్ రెడ్డి వంగా. డైరెక్టర్‌గా తన మార్కు కథలతో ప్రపంచ సినీప్రియుల మనసు గెలుచుకున్నారాయన. సందీప్‌రెడ్డి వంగా ఇప్పుడు చిత్ర సమర్పకుడిగానూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తన సొంత బ్యానర్ ‘భద్రకాళి పిక్చర్స్’లో ఓ సినిమాను రూపొందించారు సందీప్‌రెడ్డి.

ఇటీవల ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ‘8 వసంతాలు’ సినిమాలో అందం, అభినయంతోపాటు యాక్షన్‌తోనూ మెప్పించిన యంగ్ బ్యూటీ అనంతిక సనీల్‌కుమార్ ఇందులో హీరోయిన్. ‘రోమాంచకం’ అనేది ఈ సినిమా టైటిల్ కాగా.. ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ’ అనేది ట్యాగ్‌లైన్. నూ తన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దీన్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ యూత్‌ఫుల్ వైబ్స్‌తో ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా లవ్, ఫన్, బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న ఒక ఫ్రెష్ ఎంట ర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోందని అర్థమవుతోంది. ఈ విషయాన్ని సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో పంచుకుంటూ “కథ చెబుతున్నంత సేపు మనస్ఫూర్తిగా నవ్వుకున్నా. ఈ వినోదం వెనుక బలమైన భావోద్వేగ స్పర్శ ఉంది.

నేను తొలిసారిగా సమర్పిస్తున్న సినిమా ఇది. భద్రకాళి పిక్చర్స్ ఒక విలక్షణమైన మ్యూజికల్ రొమాంటిక్ కామెడీతో మీ ముందుకు వస్తోంది” అని పేర్కొన్నారు. ఉపేంద్ర లిమయె, వెంకటేశ్ కాకుమాను, నరేంద్ర రవి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: పవన్ పప్పుల; సంగీతం: వాసుకి వైభవ్.