తడబాటు ఏలనో..!?
చర్చనీయాంశంగా టాలీవుడ్ స్టార్ హీరోల వైరల్ స్పీచ్‌లు
సినిమాకు హైప్ తీసుకురావడానికి మూవీ మేకర్స్ తొక్కని తోవ ఉండదు. ‘ఏ మార్గం ఎంచుకున్నామన్నది ముఖ్యం కాదు.. మన సినిమా ప్రేక్షకుడికి చేరువయ్యిందా.. లేదా? అన్నదే పాయింట్’ అన్నట్టుంటుంది కొందరు సినీప్రముఖుల ప్రచార శైలి. ప్రమోషన్స్‌ను తమదైన స్టుల్‌లో చేయడంలో తెలుగు చిత్రపరిశ్రమ ఒక అడుగు ముందే ఉంటుంది.
ప్రమోషన్స్ ప్రేక్షకులను ఆకర్షిస్తే సరేసరి. మరి ప్రచారం బెడిసికొడితే?! మాటలు తడబడినా, వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినా సోషల్ మీడియా వేదికగా జనం చీల్చి చెండాడుతున్నారు. వాళ్లు సీనియర్ నటులా.. జూనియర్ ఆర్టిస్టులా.. అనవసరం! ‘స్టార్స్’ను కూడా నెట్టింటికి లాగేస్తున్నారు.
డిజిటల్ యుగంలో ప్రతిక్షణం కెమెరా కంట్లో పడుతోంది. నెట్టింట బందీ అవుతోంది. సెలబ్రిటీలు బహిరంగ వేదికలపై మా ట్లాడే ప్రతి చిన్న మాట, చేసే ప్రతి పొరపాటు క్షణాల్లో క్లిప్‌గా మారుతోంది. నిమిషాల్లో వైరల్ అవుతోంది. గతంలో లాగా సెలబ్రిటీల తప్పులు ఇప్పుడు అంత తేలికగా మరుగునపడిపోవటం లేదు.
సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేసేస్తున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చిన్నపాటి పొరపాట్లను పెద్ద వివాదంగా మారుస్తున్నారు. ఇటీవల సినీనటుల పొరపాట్లతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, తెలంగాణ జర్నలిస్టుల మధ్య రేగిన కొత్త వివాదం ఈ ధోరణికి అద్దం పడుతోంది.
సెలబ్రిటీల చుట్టూ చోటుచేసుకుంటన్న పరిణామాలన్నింటినీ గమనిస్తున్న నెటిజన్లు, విశ్లేషకులు సెలబ్రిటీల ప్రసం గాలు, ప్రచార వ్యూహాలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు. నిరంతర ప్రయాణాలు, ప్రమోషన్ల ఒత్తిడి, లైవ్ ఈవెంట్లలో ఉండే అలసట వల్ల ఇలాంటి పొరపాట్లు ఎవరికైనా సహజమేనని ఒక వర్గం వారు సమర్థిస్తున్నారు. మ రో వర్గం మాత్రం.. సెలబ్రిటీలు గ్రౌండ్ రియాలిటీ తెలి యకుండా, కేవలం స్క్రిప్ట్ ప్రకారం జనాన్ని ఆకట్టుకోవడానికి ‘కృత్రిమ అభిమానం’ ప్రద ర్శిస్తున్నారని, అందుకే ఇలాంటి తపు లు దొర్లుతున్నాయని విమర్శిస్తున్నారు.
అహంకారమా.. అజ్ఞానమా..?
తెలుగునాట స్టార్ హీరోలను, ప్రముఖులను కేవలం ఎంటర్‌టైనర్లుగా మాత్రమే చూడరు. వారిని దేవుడిగా ఆరాధిం చే అభిమానులుంటారు. రాజకీ య ప్రభావిత శక్తులుగా భావిస్తారు. సాం స్కృతిక ప్రతినిధులుగా కూడా చూస్తారు. సెలబ్రిటీలపై ఉండే ఈ విపరీతమైన ఆరాధనే.. వారి వ్యక్తిగత జీవితం, వారు పాల్గొనే కార్యక్రమాలపై సామాన్య జనంలో ఆసక్తిని అంతే స్థాయిలో పెంచుతోంది.
చివరగా, ఇలాంటి తప్పులు సెలబ్రిటీల అహంకారం వల్లనో, అజ్ఞా నం కారణంగానో జరుగుతున్నా యా..? లేక నేటి సోషల్ మీడి యా సమాజం.. సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషులేనని, వారూ తప్పులు చే యడం సర్వసాధారణమనే విషయాన్ని గ్ర హించలేకపోతోం దా? అనేదే ఇక్కడ ప్రశ్న.
తెరపైకి పాత వివాదాలు..
రామ్‌చరణ్ భోపాల్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో నెటిజన్లు పాత సంఘటనలను కూడా తెరపైకి తెచ్చారు. స్టార్ హీరో అల్లు అర్జున్ ‘పుష్ప2’ సక్సెస్ మీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును గుర్తుకు తెచ్చుకోవడంలో జరిగిన పొరపాటు, ఆ తర్వాత సంధ్యా థియేటర్ తొక్కిసలాట విషాద ఘటన నేపథ్యంలో మళ్లీ చర్చనీయాంశమైంది. టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి గతంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వంటి హీరోయిన్ల పేర్లను వేదికలపై తారుమారు చేసిన పాత వీడియో క్లిప్స్ కూడా మరోమారు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.
రామ్‌చరణ్ ‘భోపాల్’ ప్రమోషన్స్ వివాదం
ఇటీవల తన తాజాచిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా భోపాల్ వెళ్లిన టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ రెండు పెద్ద పొరపాట్లు చేశారు. రాపిడ్-ఫైర్ ఇంటర్వ్యూలో భారత స్టార్ క్రికెటర్ బుమ్రాను ‘ఫుట్‌బాలర్’ అని పేర్కొన్నారు. వేదికపై ఉన్న ఉత్సాహంలో భోపాల్ ప్రజలను ‘బీహార్ ప్రజలు’ అని సంబోధించారు. ఈ రెండు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
దీంతో రామ్‌చరణ్ వెంటనే ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అంత భారీగా ఉన్న జనాన్ని చూసిన హడావిడిలో దొర్లిన ‘మానవ సహజమైన పొరపాటు’ అని పేర్కొన్నారు. క్షమాపణ కూడా చెప్పారు. అభిమానులు దీన్ని అర్థం చేసుకున్నప్పటికీ ‘సెలబ్రిటీలకు గ్రౌండ్ రియాలిటీపై కనీస అవగాహన ఉండదా?’ అంటూ కొత్త చర్చకు దారి తీశారు నెటిజన్లు.






