అంగన్ వాడి కేంద్రంలో ప్రీస్కూల్ పట్టభద్రుల దినోత్సవం
20-04-2026 06:26 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలోని అంగన్ వాడి కేంద్రం -3లో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ప్రీ స్కూల్ పట్టభద్రుల దినోత్సవం అంగన్వాడి సూపర్వైజర్ ధరణి, టీచర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు చిన్నారులకు పట్టభద్రుల పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... తల్లిదండ్రుల భాగస్వామ్యం పిల్లల విద్యలో వారి పాత్ర, సమతుల్య పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. అంగన్వాడి సిబ్బంది పిల్లల ఆరోగ్యం పోషణ ప్రారంభ విద్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు కటకం ఉమా పోకల నాగమణి, విమలమ్మ, పుష్పాంజలి, తిరుపతమ్మ, పిల్లలు పాల్గొన్నారు






