21 August, 2026 | 12:17 AM

కార్మిక హక్కులు చట్టాల రక్షణకై సమరశీల పోరాటాలకు సిద్ధం కండి

21-08-2026 12:04 AM

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేనశంకర్ పిలుపు 

సుల్తానాబాద్, ఆగస్టు 20 (విజయ క్రాంతి): కార్మికుల హక్కులు, చట్టాల రక్షణకై సమరశీల పోరాటానికి సిద్ధం కండి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు,గురువారం పెద్దపెల్లి జిల్లా ఏఐటీయూసీ నాలుగవ మహాసభ సు ల్తానాబాద్ ఐబి గెస్ట్ హౌస్ నుండి భారీ కా ర్మిక ప్రదర్శన బయలుదేరి యశోద నరహరి ఫంక్షన్ హాల్ వరకు సాగింది, అనంతరం అమరవీరులను స్మరిస్తూ ఎర్రజెండాను ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజుఆవిష్కరించారు.

అనంతరం జరిగిన మహాసభకు అధ్యక్ష వర్గముగా వైవి రావు. పూసల రమేష్ వ్యవహరించగా. ముఖ్య అతిథులుగా హాజరైన కలవేన శంక ర్, బాలరాజు లు మాట్లాడుతూ కార్మిక ఉద్యోగ హక్కుల రక్షణకై చట్టాల అమలుకై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు , పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలు గు కోట్లుగా విభజించి కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని దుయ్యబట్టారు, ఏఐటీయూసీ దేశంలో అనేక పోరా టాలు అనేక త్యాగాలు అనేక హక్కులు చట్టబద్ధహక్కులు సంక్షేమ సౌకర్యాలు సాధించిపెట్టిన ఘనత ఏఐటియుసిదే అని అన్నారు.

ప్రభుత్వాలు మారిన కార్మికుల బ్రతుకులు మారడం లేదని పోరాడితే కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఉద్యోగ భద్రత ఉపాధి హక్కుల సంక్షేమ సౌకర్యాలకై సమరసిల పోరాటాలు ఏఐటీయూసీ ఆధ్వర్యం లో దేశవ్యాప్తంగా జరుపతల పెట్టామని దీనికి అన్ని సంఘాల్ని ఐక్యం చేసి ఐక్య పోరాటం చేస్తామని కార్మికులు ఐక్యంగా సమరసిల పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు,

ఈ మహాసభలో జిల్లా రిపోర్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపారు, ఈ సభలో ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ మెంబర్ మారగోని ప్రవీణ్ కుమార్, .సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, గౌతమ్ గోవర్ధన్, రామగుండం సిపిఐ కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య. 

అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ నాంసాని శంకర్, రెడ్డపాక లక్ష్మణ్, కే రాజరత్నం, ఎం ఆర్ సి రెడ్డి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి యజ్జ రాజయ్య బృం దం విప్లవ అమరుల పాటలు ఆలపించగా కార్మికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.