21 August, 2026 | 12:44 AM

రూపారెడ్డి హత్యా నిందితులను శిక్షించాలి

21-08-2026 12:05 AM
  1. నేడు ప్రైవేట్ స్కూల్స్ బంద్ 
  2. తెలంగాణ రికగ్‌నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్

ముషీరాబాద్, ఆగస్టు 20(విజయక్రాంతి): నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డిని హత్య చేసిన విద్యార్థులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఘటనకు నిరసనగా శుక్రవారం  రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల బంద్కు పిలుపునిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో రూపారెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులకు రక్షణ లేకుండా పోవడం ఆందోళనకరమన్నారు. పాఠశాలకు మొబైల్ ఫోన్ తీసుకురావద్దని చెప్పినందుకు ప్రిన్సిపాల్ను హత్య చేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు.

భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులైన విద్యార్థులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల రక్షణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని యాదగిరి కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు సురభి రవీందర్ రావు, నాగరాజు, డానియల్, బాలరాజు,  తిరుపతిరెడ్డి,  అంజన్ రెడ్డి, నర్సిరెడ్డి, పరశురాం గౌడ్, షేక్ మదర్ తదితరులు పాల్గొన్నారు.