21 August, 2026 | 1:26 AM

వర్షిత్‌కు కాంస్య పతకం

21-08-2026 12:15 AM

జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్

భువనేశ్వర్, ఆగస్టు 20: 52వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్ లో తెలంగాణ స్విమ్మర్లు సత్తా చాటుతున్నారు. తాజాగా పురుషుల 200 మీటర్ల మెడ్లీలో తెలంగాణకు చెందిన ధూళిపూడి వర్షిత్ కాంస్య పతకం సాధించాడు. ఈ రేసులో వర్షిత్ 2 నిమిషాల 10.97 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు.

గత రెండేళ్లుగా పలు జాతీయ స్థాయి పోటీల్లో వర్షిత్ నిలకడగా రాణిస్తూ పతకాలు గెలుస్తున్నాడు. 2024 జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. అలాగే 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో 400 మీటర్ల విభాగంలో గోల్ మెడల్ గెలుచుకున్నాడు. వర్షిత్ తన ఎనిమిదేళ్ల వయసు నుంచే జియాన్ స్పోరట్స్ స్విమ్మింగ్ అకాడమీ చీఫ్ కోచ్ జాన్ సిద్ధిఖీ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు.