11 May, 2026 | 3:20 AM

పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలకు సన్నాహాక సమావేశం

11-05-2026 12:58 AM

సూర్యాపేట, మే 10 (విజయక్రాంతి) : పట్టణ ఆర్యవైశ్య సంఘ ఎన్నికల సన్నాహక జనరల్ బాడీ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు  మంచాల రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ ఎన్నికలను పారదర్శకంగా, ఐక్యంగా నిర్వహించేందుకు 20 మంది సభ్యులతో నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సంఘ అభివృద్ధి కోసం ప్రతి సభ్యుడు బాధ్యతగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘ బలోపేతం, సభ్యుల ఐక్యత, సేవా కార్యక్రమాల విస్తరణపై సమావేశంలో చర్చించారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సోమనర్సయ్య, కోశాధికారి చల్లా లక్ష్మికాంత్, జిల్లా ఆర్యవైశ్య పొలిటికల్ చైర్మన్ బండారు రాజా, జిల్లా, పట్టణ  నాయకులు కర్నాటి కిషన్, తోట శ్యామ్, బొమ్మిడి, లక్ష్మీనారాయణ, వెంపటి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.