11 May, 2026 | 4:49 AM

ఎమ్మెల్యేపై తప్పుడు వార్తలు రాసిన రిపోర్టర్‌పై చర్యలు తీసుకోవాలి

11-05-2026 12:58 AM

నాగిరెడ్డిపేట్, మే 10 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పై తప్పుడు వార్తలు రాసిన కామారెడ్డి రిపోర్టర్ పై నాగిరెడ్డిపేట మండలం పోలీస్ స్టేషన్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు ఆదివారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ ఇంజమూరి వెంకటేశం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహ్ప తప్పుడు ఆరోపణలు చేస్తూ, తప్పుడు వార్తలు ప్రచురించారని  ఆరోపించారు. ఎన్నికల సమ యంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆంధ్రప్రభలో వచ్చిన వార్త వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మదన్మోహన్ నియోజకవర్గ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా తప్పుదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా వార్త రాశారని తెలిపారు.ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ఆంధ్రప్రభ రిపోర్టర్ ఇంజమూరి వెంకటేశంపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో తెలుపుతూ నాగిరెడ్డిపేట ఎస్త్స్ర భార్గవ్ గౌడ్కు వినతి పత్రాన్ని అందజేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, నాయకులు రామచంద్రారెడ్డి, వాసురెడ్డి,మురళి గౌడ్,దత్తు, ఇమామ్,సంజీవరావు, హనుమాన్లు, లక్ష్మణ్ ఠాగూర్, గులాబ్ హుస్సేన్, వెంకా గౌడ్, సుధాకర్, శ్రీరామ్ గౌడు, నారాయణరెడ్డి పాల్గొన్నారు.