25 July, 2026 | 7:37 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత

25-07-2026 06:53 PM

సర్పంచ్ కృష్ణనాయక్

జాజిరెడ్డిగూడెం,(అర్వపల్లి): పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కనీసం 6 నుంచి 10 మొక్కలు నాటి, బాధ్యతగా వాటిని సంరక్షించాలని సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సూర్యానాయక్ తండా గ్రామంలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెరుగుతున్న కాలుష్యం,వాతావరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత వంటి సమస్యలను అధిగమించాలంటే విస్తృతంగా మొక్కలు నాటడం ఒక్కటే శాశ్వత పరిష్కారం అన్నారు. నాటిన మొక్కను బాధ్యతగా పెంచి,గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశాలు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.