బెజ్జూర్‌లో ఘనంగా తొలి ఏకాదశి
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో తొలి ఏకాదశి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్ ఆలయాలలో అన్ని రకాల భక్తులకు సౌకర్యాలు సమకూర్చారు. స్వామి వారికి మాండూరి లక్ష్మణ్, మిరియాల ప్రవీణ్, పొన్న రవి, రామగిరి శ్రీనివాస్ కటింగ్ షాప్ భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూల అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తొలి ఏకాదశి పురస్కరించుకొని శ్రీ రంగనాయక స్వామి, శివాలయం, వీర హనుమాన్, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మిరియాల పెంటయ్య బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు ఎక్కామ భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






