25 July, 2026 | 8:32 PM

నీటి వనరులను వృధా అరికట్టి సద్వినియోగం చేసుకోవాలి

25-07-2026 07:08 PM

బోథ్,(విజయక్రాంతి): వర్ష బాగా పరిస్థితుల వల్ల నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని నీటి వృధాను అరికట్టాలని ఎంపీడీవో రమేష్ పేర్కొన్నారు. శనివారం గ్రామపంచాయతీలో వార్డు సభ్యులతో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి వృధాను అరికట్టకపోతే భావితరాలకు ఇబ్బందులు తప్పమన్నారు. మరోవైపు ఇంటింటికి ఇంకుడు గుంతను నిర్మించుకోవాలని కమ్యూనిటీ ఇంకుడు గుంతల వల్ల బోరుబావులకు లాభం చేపడుతుందన్నారు. పొలాలలో సైతం కట్టల నిర్మాణం కుంటల నిర్మాణం చేపట్టాలని నీటి వృధా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డు సభ్యులు నాయకులు వారి వారి గ్రామాలలో వార్డులలో ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ కార్యదర్శి అశోక్ కుమార్ లతోపాటు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.