25 July, 2026 | 8:07 PM

Breaking News

మహేశ్వరంలో ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పరిశీలన

25-07-2026 06:49 PM

*  ఓట్ల తొలగింపునకు బీజేపీ కుట్రలన్న కేఎల్ఆర్

​మహేశ్వరం,(విజయక్రాంతి): మహేశ్వరం మండల పరిధిలోని పెండ్యాల గ్రామంలో శనివారం ఎన్యుమరేషన్ ఫారమ్‌ల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) పరిశీలించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన విజయవంతంగా కొనసాగుతోందన్నారు. హస్తం పార్టీ నేతలు, కార్యకర్తల ఓట్లను అక్రమంగా తొలగించేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని కేఎల్ఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.