8 May, 2026 | 3:55 AM

మోదీ సభకు సన్నద్ధం

08-05-2026 12:53 AM

* భారీగా జన సమీకరణకు ప్లాన్

* కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టి

కరీంనగర్, మే7 (విజయక్రాంతి): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల 10న సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చుట్టు పక్కల జిల్లాల నుండి భారీ ఎత్తున జనాన్ని సమీకరించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుం డి అత్యధిక సంఖ్యలో జన సమీకరణ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రత్యేక ద్రుష్టి సారించారు.

నాలుగు రోజులుగా కరీంనగర్ లోనే మకాం వేసి ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి పార్టీ నేతలతో జన సమీకరణపై సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం సమావేశాలు నిర్వహించారు గ్రామాల వారీగా వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, కౌన్సిలర్లు. మాజీ ప్రజాప్రతినిధు లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కా ర్పొరేటర్లు, కంటెస్టెట్ కార్పొరేటర్లతోనూ మీ టింగ్ లు నిర్వహించారు. జిల్లాల వారీగా మండలాల అధ్యక్షులతో, జిల్లా అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు.

గ్రామాలు, మండ లాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల వారీగా జన సమీకరణ లక్ష్యాన్ని నిర్దేశించారు. మండలాల వారీగా జన సమీకరణపై ఇంఛార్జీలను నియమించారు. అట్లాగే మోదీ సభకు జన సమీకరణ విషయంలో రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా ఇంఛార్జీలుగా నియమించిన సంగతి తెలిసిందే. అందులో భాగాం కరీంనగర్ జిల్లా ఇంఛార్జీగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, సిరిసిల్ల జిల్లా ఇంఛార్జీగా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సైతం జిల్లాల వారీగా పార్టీ నేతలతో మీటింగ్ నిర్వహించారు.

మండలాల వారీగా ఎన్ని బస్సులు కావాలి? ఎన్ని కార్లు కావాలనే వివరాలను నేతల నుం డి వివరాలు తీసుకున్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా నేతల నుండి తీసు కున్న వివరాల ప్రకారం... కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఏకంగా వెయ్యి కార్లు, 250 బస్సులను ఏర్పాటు చేసి వేలాది మందిని మోదీ సభకు తరలించాలని నిర్ణయించారు. రవాణా, మంచి నీళ్లు, భోజన సదుపాయలు కల్పించి మోదీ సభ కు తీసుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ సభకు జన సమీకరణ విషయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచేలా జనాన్ని సమీకరించాలని సూచించారు.