కొల్గూర్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగం ప్రారంభం
18-07-2026 07:48 PM
గజ్వేల్: మండల పరిధిలోని కొల్గూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ విభాగాన్ని అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ తిరుపతమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ... చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే లక్ష్యంతో ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించామని తెలిపారు. గ్రామంలోని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని, అనవసరంగా ప్రైవేట్ పాఠశాలల్లో చేరదీసి ఆర్థిక భారం మోసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






