18 July, 2026 | 8:48 PM

సూర్యాపేట జిల్లా సృష్టికర్త జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

18-07-2026 08:03 PM

ఘనంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లిలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు సూర్యాపేట జిల్లా ఏర్పాట్లు ప్రముఖ పాత్ర పోషించిన గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం మాజీ మండల పార్టీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్ర ఏర్పాటు అనంతరం విద్యా విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసి, తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ వెలుగులు నింపిన మంత్రిగా చరిత్రలో నిలిచారన్నారు. ఆయన సారధ్యంలో సూర్యాపేట జిల్లా అన్ని రంగాలుగా అభివృద్ధి చెందిందని, హుజూర్నగర్ పరిసర గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. మొదట మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంపిణీ చేశారు.