చేగుంటలో మంత్రి గడ్డం వివేక్ పర్యటన
సాబీర్ హుస్సేన్ నివాసంలో ఆత్మీయ విందు, ఘన సన్మానం
చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ‘ఎల్ నినో’ ప్రభావంపై అవగాహన సదస్సు, అలాగే పీఎం శ్రీ పాఠశాలలో 'Sureify సంకల్ప్ ఆర్గనైజేషన్' ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ గడ్డం వివేక్ కుమార్ చేగుంటలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చేగుంటలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాబీర్ హుస్సేన్ నివాసానికి విచ్చేసి, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, అక్కడ ఏర్పాటు చేసిన తేనేటి విందు, అల్పాహారాన్ని స్వీకరించారు. తమ ఇంటికి ముఖ్యఅతిథిగా వచ్చిన మంత్రి గడ్డం వివేక్ కుమార్, సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి ని సాబీర్ హుస్సేన్, తాడేం వెంగళ్ రావు,శాలువాతో అత్యంత ఘనంగా సన్మానించగా, ఈ ఆత్మీయ కలయికలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






