18 July, 2026 | 9:11 PM

ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి

18-07-2026 08:20 PM

వ్యవసాయ విస్తీర్ణ అధికారి ప్రతిమ

కామారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు సాగు మోగ్గు చూపాలని కామారెడ్డి వ్యవసాయ విస్తీర్ణ అధికారిని ప్రతిమ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా  గూడెం గ్రామపంచాయతీ ఆవరణలో  వరికి ప్రత్యామ్నాయంగా , ఆరుతడి పంటల సాగుపై అవగాహన  సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరికి బదులుగా మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ, కంది, పెసరలు, మినుములు, వంటి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. తక్కువ నీటి లభ్యత ఉన్న బోర్ల వద్ద మల్చింగ్ పద్ధతి ద్వారా మైక్రో ఇరిగేషన్ విధానాలను అనుసరించి కూరగాయలు  తదితర పంటలను సాగు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రతిమ గ్రామ సర్పంచ్ యాదగిరి గౌడ్, ఉప సర్పంచ్ అశోక్, గ్రామ రైతులు పాల్గొన్నారు.