18 July, 2026 | 9:18 PM

మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు

18-07-2026 08:26 PM

కొండపాక,(విజయక్రాంతి): నర్మెట ఆయిల్ ఫామ్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండపాక మండల కేంద్రంలో యంగ్ ఇండియా పాఠశాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వేరే ప్రాంతానికి తరలిస్తున్నారని సమాచారంతో సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ని కలిసి యంగ్ ఇండియా పాఠశాలను కొండపాక మండల కేంద్రంలోని ప్రారంభించాలని వినతి పత్రం అందించిన యంగ్ ఇండియా పాఠశాల సాధన సమితి సభ్యులు.

ఈ సందర్భంగా యంగ్ ఇండియా పాఠశాల సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం కొండపాక మండల  లోని పేద, మధ్యతరగతి, విద్యార్థులకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోని కొండపాక మండలంలో యంగ్ ఇండియా స్కూల్ ఎంపిక చేయాలని కోరారు. దీనికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా స్కూల్ సాధన సమితి సభ్యులు, అఖిలపక్ష నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన, సామాజిక సంస్థల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.